పోస్ట్‌లు

How can we treat children who have symptoms of COVID a home?

చిత్రం
As of now COVID has no drug, but fear has, which is genuine information and knowledge. In the second wave we have started seeing children being affected by this pandemic. Many parents are in a situation where they can not take their child to hospital even if they want to. The aim of this article is to instill some courage and confidence in the parents by raising awareness about the disease itself.  The first thing to remember is that children can easily overcome the disease compared to adults. After seeing hundreds of such children over the past year and talking to thousands of parents ,I am making this effort to allay common fears that naturally arises in them. When should COVID be suspected in children? If someone in the house has had a COVID within the last fortnight, or if child is going to school or tuition and if any of the following symptoms show up. 1.) Cough 2.) Cold 3.) Headache 4.) Vomiting 5.) Diarrhea  6.) Bodyaches 7.) Stomach pain 8.) Fever 9.) Sore throat  10.) Fatigu

చిన్న పిల్లలలో కరోనా, ఇంట్లో ఉంటూ చూసుకోగలమా ?

చిత్రం
  కరోనాకి మందు లేదు, కాని భయానికి మందు ఉంది, అదే  సరైన సమాచారం మరియు  జ్ఞానం . కరోనా రెండొవ వేవ్ లో మనం పెద్దలతో పాటు చిన్న పిల్లల లో కూడా లక్షణాలు రావటం చూస్తున్నాం. పిల్లల్ని వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్లాలనిపించినా తీసుకెళ్లలేని పరిస్థితుల్లో ఎందరో తల్లిదండ్రులు ఉన్నారు. ఇలాంటి సమయంలో తల్లిదండ్రులలో ఈ వ్యాధి గురించి అవగాహన పెంచడం ద్వారా వారిలో కొంత దైర్యాన్ని నమ్మకాన్ని నింపటమే ఈ వ్యాసం లక్ష్యం.  మొదటిగా గుర్తుపెట్టుకోవాసింది పెద్దలతో పోలిస్తే పిల్లలు ఈ వ్యాధిని సులభంగా జయిస్తారు. గత సంవత్సర కాలం లో వందలాది మంది ఇలాంటి పిల్లలను చూసి,  వేలాదిమంది తల్లిదండ్రులతో మాట్లాడిన తరువాత వారిలో సహజంగా వచ్చే అనుమానను నివృత్తి చేయటానికి ఈ  ప్రయత్నం చేస్తున్నాను. పిల్లల లో కరోనా వ్యాధి వచ్చినట్లు ఎప్పుడు అనుమానించాలి ? ఇంట్లొ ఎవరికైన గత పదిహేను రోజులలోపు కరోనా వచ్చి ఉంటె, లేదా బాబు లేదా పాప స్కూల్ కి లేదా ట్యూషన్ కి వెళ్తుంటే , ఈ క్రింది లక్షణాల్లో ఏదైనా ఉంటే 1.) దగ్గు   2.) జలుబు 3.) తలనొప్పి   4.)వాంతులు  5.)విరోచనాలు  6.) ఒళ్లు నొప్పులు   7.)కడుపు నొప్పి  8.)జ్వరం   9.)గొంతు నొప్పి  10.)ఆయాసం 

పిల్లల్లో వాంతులు , విరోచనాలు అవుతున్నప్పుడు తల్లిదండ్రులు పాటించాల్సిన జాగ్రత్తలు . Suggestions on how to deal with the child when the child is having vomiting and loose stools.

చిత్రం
పిల్లల్లో జ్వరం తరువాత తరచుగా వచ్చే సమస్య వాంతులు లేదా విరోచనాలు అవ్వటం. రోటా వైరస్ వాక్సిన్ వచ్చిన తరువాత మరియు స్వచ్ఛమైన త్రాగు నీరు అందుబాటులోకి వచ్చాక ఈ సమస్య మునుపటి మీద తగ్గగిన మాట నిజం. సాధారణంగా మొదటి ఐదు సంవత్సరాల వయసులో ఎక్కువగా ఈ సమస్య  వస్తుంది మరియు చిన్నపిల్లల్లో ఇది ప్రాణాంతకం కూడా. పిల్లలలో విరోచనాలు లేదా వాంతులు మొదలయ్యాక ఎం చెయ్యాలో, ఎప్పుడు హాస్పిటల్ కి తీసుకెళ్ళల్లో ఈ వ్యాసంలో వివరిస్తాను. పిల్లల్లో విరోచనాలు వాంతులు అవ్వటానికి కారణాలు: 1.) శుభ్రంగా లేని ఆహారం తినటం లేదా నీరు తాగటం. 2.) పాల డబ్బాతో పాలు తాగటం. 3.) క్రింద పడిన వస్తువులు నోట్లో పెట్టుకోవడం. 4.) చేతులు సుబ్రంచేసుకోకుండా ఆహరం తినటం లేదా తినిపించడం. 5.) నిల్వ ఉన్న ఆహరం లేదా బయటనుండి తెచ్చిన ఆహరం తినటం. 6.) పళ్ళు వస్తున్నప్పు విరోచనాలు అవ్వటం సహజం అనుకోవటం ఒక అపోహ. ఆ వయసులో పిల్లలు అన్ని వస్తువులూ నోట్లో పెట్టుకోవటానికి ప్రయత్నిస్తారు. దీనివలన ఇన్ఫెక్షన్ మరియు విరోచనాలు కావచ్చు. లక్షణాలు: 1.) ఒకటికి మించి వాంతులు అవ్వటం. 2.) విరోచనం బాగా పల్చగా నీరు లాగ వెళ్ళటం. బాగా చెడు వాసన రావటం. 3.) ముడ్డ

ఆరు నెలలలోపు వయసున్న పిల్లలగురించి తల్లిదండ్రులు తెలుసుకోవలసిన ముఖ్యమైన విషయాలు. Important things to know while raising an infant(until 6 months of age).

చిత్రం
  పాపాయికి ఒక నెల వయసు నిండగానే ఒక ముఖ్యమైన మైలురాయి దాటినట్లు. తల్లిలో పాపను తాను చూసుకోగలననే ధైర్యం వస్తుంది. ముఖ్యంగా చూడటానికి వచ్చేవాళ్ళు తగ్గుతారు, సమస్యలు, సలహాలు తగ్గుతాయి. కాని కొన్ని ప్రత్యేకమైన ఇబ్బందులు ఈ వయసులోనే మొదలవుతాయి. కాబట్టి తల్లిదండ్రులకు ఏది సహజం , ఏది ప్రమాదం, ఎప్పుడు వెంటనే హాస్పిటల్ కి తీసుకెళ్ళలో తెలుపటం కోసం ఈ వ్యాసం. 6 నెల ల లోపు పిల్లలకు ఏది సహజం? ) ప్రతీనెలా అర కేజి నుండి కేజి వరకు బరువు పెరుగుతారు. ఐదు నెలలు నిండేసరికి పుట్టిన బరువుకి రెట్టింపు బరువవుతారు. ) తల్లి పాలు లేదా డబ్బా పాలు తాగిన తరువాత మూడు నుండి ఐదు గంటల వరకు పడుకుంటారు. ఒక వేళ గంట గంటకు లేచి ఏడుస్తుంటే పాలు సరిపొవట్లేదని అర్థం. ) నెల వయసు నుండి ఐదు నెలలల వయసు లోపు పిల్లలు ఒక్కొక్కసారి ఉన్నట్లుండి ఏడవటం మొదలు పెడతారు. గంట నుండి రెండు గంటలవరకు ఏడుస్తారు. అల ఏడుస్తున్నప్పుడు పొట్ట బిగుతుగా అనిపిస్తుంది. కొంత మంది పిల్లలు గుక్క తిప్పకుండా ఏడుస్తారు. ఇది సాధారణంగా సాయంత్రం వేళ నుండి అర్థరాత్రి మధ్యలో జరుగుతుంటుంది. ప్రతీ రోజూ అదే సమయానికి మళ్ళి ఏడుపు మొదలుపెడుతుంటారు. దీనినే ఈవెనింగ్

నెల లోపు వయసున్న పిల్లల తల్లిదండ్రులకు ముఖ్యమైన సూచనలు. Essential information for parents of a new born baby.

చిత్రం
 ఇంట్లో బాబు లేదా పాపాయి పుట్టగానే ఎంతో ఆనందంతో పాటు ఎన్నో సంశయాలు ఉంటాయి. మొదటి సారి పిల్లలకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు కంగారు మరింత ఉంటుంది. అది సహజం. ఇంట్లో పెద్ద వారు, పుట్టిన బిడ్డను చూడటానికి వచ్చినవారు తోచిన సలహాలు చెప్తుంటారు. వాటిలో ఏది నమ్మాలో ఏది అనుసరించాలో తెలియక తల్లిదండ్రులు మరింత భయపడతారు. అలాంటి తల్లిదండ్రుల వీలు కోసం ఈ వ్యాసం లో క్లుప్తంగా ఏం చెయ్యాలో ఏం చేయకూడదో , ఎప్పుడు వెంటనే డాక్టర్ గారిని కలవాలో చెప్తాను. నెలలోపు పిల్లలకు ఏది సహజం? ) పుట్టిన పిల్లల బరువు సాధారణంగా 2.5 కిలోల నుండి 4 కిలోలవరకు ఉంటుంది. మొదటి వారం పుట్టిన బరువులో పది శాతం తగ్గడం సహజం. పుట్టిన 10 రోజులకు పుట్టిన బరువుని మళ్ళి చేరుకుంటారు. ఆ తరువాత మూడు నెలల వరకు వారానికి 200 గ్రాముల నుండి 300 గ్రాముల వరుకు పెరుగుతుంటారు అంటే నెలకు ముప్పావు కేజీ నుండి ఒక కిలో పెరుగుతారన్నమాట.  ) బాబు లేదా పాప కి తల్లి పాలు వీలైనంత త్వరగా మొదలు పెట్టాలి. సాధారణ కాన్పు అయితే వెంటనే మొదలు పెట్టచ్చు. సిసేరిన్ కాన్పు అయితే తల్లికి కొంచం ఓపిక రాగానే రొమ్ముపాలు మొదలుపెట్టాలి. ) పిల్లవాడు ఏడ్చినప్పుడల్లా రొమ్ము

Part 2 పిల్లలలో టీకాలు వేయించాలా? ఏవి వేయించాలి? ఎక్కడ వేయించాలి? రెండొవ భాగం. Guide book to help parents with vaccination 2.

చిత్రం
  మొదటి భాగం తరువాయి: ప్రతీ టీకాను ఆమోదించే ముందు ఎన్నో సంవత్సరాలు పరీక్షలు చేస్తారు.  చేసి ప్రమాదకరం కాదు మరియు పనిచేస్తాయి అని నిరూపింపబడిన తరువాతే పిల్లలో వేయటానికి అనుమతిస్తారు. టీకాల వల్ల వచ్చే దుష్పరిణామాలను ఎలా గుర్తించాలి ఎప్పుడు హాస్పిటల్ కి తీసుకు వెళ్ళాలి? టీకాలు సురక్షితమైనవి మరియు మీ పిల్లల ఆరోగ్యానికి వారి జీవితమంతా ముఖ్యమైన ప్రయోజనాలను అందిస్తాయి. చాలా అరుదుగా లక్షల్లో ఒకరికి టీకా తరువాత ప్రమాదకరమైన సైడ్ ఎఫెక్ట్స్ రావచ్చు.అవి వెంటనే గుర్తిస్తే తగిన వైద్యం చేయటానికి అవకాశం ఉంటుంది 1.) టీకా వేయగానే పెదాలు కళ్ళు వాయటం, చర్మం మీద దద్దుర్లు రావటం, ఆయాసం రావటం(Aanphylaxis).  2.)  విపరీతమైన జ్వరం రావటం(>102 F), Paracetmol తో జ్వరం తగ్గకపోవడం . 3.) రెండు రోజులకు మించి జ్వరం ఉండటం. 4.) ఫిట్స్ రావడం లేదా పిల్లాడు మగతగా ఉండటం 5.) ఒక రోజుకంటే ఎక్కువ చిరాకుగా ఏడుస్తూ ఉండటం. 6.) టీకా వేసిన దగ్గర నొప్పితో వాపు వారానికి పైగా ఉండటం లేదా వాపు పెరుగుతూ ఉండటం. పిల్లలో దెబ్బ తగిలితే TT  ఇంజక్షన్ చేయించాలా? క్రమం తప్పకుండా టీకాలు వేయించిన పిల్లలకి 15 సంవత్సరాల వరకు దెబ్బలు తగిలాక ఇవ్వాల్స

జ్వరం తో బాధపడుతున్న పిల్లలకి: ఎప్పుడు ఇంట్లోనే ఉంటూ చూసుకోగలము మరియు ఎప్పుడు వైద్యుడిని సందర్శించాలి? When can we treat a child with fever at home?

చిత్రం
   ఇంట్లో పిల్లాడికి జ్వరం రాగానే తల్లిదండ్రులకు ఉండే కంగారు ఒక డాక్టర్ గా మరియు ఇద్దరు పిల్లల తండ్రిగా నేను అర్థం చేసుకోగలను. ఆ పరిస్థితిలో తల్లిదండ్రులకు మొదట వచ్చే సంశయం హాస్పిటల్ కి తీసుకెళ్లాలా లేక కొంత సమయం వేచిచూడాలా అని. అందుకే ఎప్పుడు ఇంట్లో చూసుకోవచ్చు ఎప్పుడు హాస్పిటల్ కి తీసుకెళ్ళాలి అన్న విషయం తెలిసి ఉండటం తప్పనిసరి. పిల్లల్లో జ్వరం తో తల్లిదండ్రులకు చాలా కంగారు ఉన్నప్పటికీ, అందులో చాలామందికి ఇంట్లోనే సురక్షితంగా వైద్యం చెయ్యవచ్చు. ఇప్పుడు మీరు చదవబోయే వ్యాసంలో పిల్లలకి ఎప్పుడు ఇంట్లో వైద్యం చెయ్యవచ్చు ఎప్పుడు తప్పనిసరిగా డాక్టర్ గారిని కలవాలి అన్న విషయాలను తెలుసుకుందాం. చిన్న పిల్లల్లో నుదురు, పొట్ట, అరిచేతులు,పాదాలు వెచ్చగా ఉండటం సహజం, దానినే జ్వరం అని తల్లిదండ్రులు కంగారు పడుతుంటారు. పిల్లాడి ఉష్ణోగ్రత/temperature 100° F లేదా 38° C కంటే ఎక్కువ ఉంటేనే జ్వరం ఉన్నట్లు. ఇంట్లోనే ఉంటూ, చూడగలిగే/ చికిత్స చేయగల జ్వరం : జ్వరం అనేది వ్యాధికి వ్యతిరేకంగా శరీరం చేసే పోరాటం. ఇది ఒక లక్షణం, ఒక వ్యాధి కాదు.జ్వరం ఉన్నప్పుడు పిల్లలు నీరసంగా ఉన్నప్పటికీ, ఉష్ణోగ్రత 103° F (లేదా