చిన్న పిల్లలలో కరోనా, ఇంట్లో ఉంటూ చూసుకోగలమా ?

 కరోనాకి మందు లేదు, కాని భయానికి మందు ఉంది, అదే  సరైన సమాచారం మరియు  జ్ఞానం.

కరోనా రెండొవ వేవ్ లో మనం పెద్దలతో పాటు చిన్న పిల్లల లో కూడా లక్షణాలు రావటం చూస్తున్నాం. పిల్లల్ని వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్లాలనిపించినా తీసుకెళ్లలేని పరిస్థితుల్లో ఎందరో తల్లిదండ్రులు ఉన్నారు. ఇలాంటి సమయంలో తల్లిదండ్రులలో ఈ వ్యాధి గురించి అవగాహన పెంచడం ద్వారా వారిలో కొంత దైర్యాన్ని నమ్మకాన్ని నింపటమే ఈ వ్యాసం లక్ష్యం. 

మొదటిగా గుర్తుపెట్టుకోవాసింది పెద్దలతో పోలిస్తే పిల్లలు ఈ వ్యాధిని సులభంగా జయిస్తారు.

గత సంవత్సర కాలం లో వందలాది మంది ఇలాంటి పిల్లలను చూసి,  వేలాదిమంది తల్లిదండ్రులతో మాట్లాడిన తరువాత వారిలో సహజంగా వచ్చే అనుమానను నివృత్తి చేయటానికి ఈ ప్రయత్నం చేస్తున్నాను.

పిల్లల లో కరోనా వ్యాధి వచ్చినట్లు ఎప్పుడు అనుమానించాలి ?

ఇంట్లొ ఎవరికైన గత పదిహేను రోజులలోపు కరోనా వచ్చి ఉంటె, లేదా బాబు లేదా పాప స్కూల్ కి లేదా ట్యూషన్ కి వెళ్తుంటే , ఈ క్రింది లక్షణాల్లో ఏదైనా ఉంటే

1.) దగ్గు   2.) జలుబు 3.) తలనొప్పి   4.)వాంతులు  5.)విరోచనాలు 

6.) ఒళ్లు నొప్పులు  7.)కడుపు నొప్పి  8.)జ్వరం   9.)గొంతు నొప్పి 

10.)ఆయాసం  11.)విపరీతమైన నీరసం. 12.)కళ్ళు ఎర్రబడటం

అనుమానం రాగానే ఏం చెయ్యాలి?

వీలైతే మీ పిల్లల వైద్యుడిని సంప్రదించి మీ అనుమానాన్నివ్యక్తపరచండి, సలహా మేరకు COVID PCR పరీక్ష చ్చేయించండి. 

ఇంట్లో జ్వరానికి అవసరమైన మందులు, thermometer, pulse oxymeter ఉన్నాయో లేదో చూసుకోండి.

పిల్లలోచాలా వరకు కరోనా కూడా సాధారమైన వైరల్ ఇన్ఫెక్షన్ల లాగానే ప్రవర్తిస్తుందని గుర్తుంచుకోండి , కంగారు అవసరం లేదు.

ఎవరిలో ఇది ఎక్కువ ప్రమాదం?

1.) ఆరు నెలల లోపు పిల్లల ఆరోగ్యం త్వరగా క్షీణించచ్చు.

2.) పన్నిండు సంవత్సరాల పైన వయసున్న పిల్లల లో ఈ వ్యాధి కొంచెం పెద్ద వారిలా ప్రవర్తించచ్చు.

3.) అధికబరువు ఉన్న పిల్లలు.

4.) గుండె మరియు ఊపిరితిత్తుల సమస్యలున్నా పిల్లలు, అవయవ మార్పిడి లేదా Bone marrow transplantation చేయించుకున్న పిల్లలు, లేదా chemotherapy/ immunosuppression  వైద్యం ఉపయోగిస్తున్న పిల్లలు.

ఇంట్లో ఉంటూ ఎలా చూసుకోవచ్చు?

1.) డాక్టర్ గారిని సంప్రదించినమీదట జ్వరం వచ్చినప్పుడు మాత్రమే తగిన మోతాదులో Paracetmol కనీసం ఆరు గంటల వ్యవధిలో వెయ్యాలి.

2.) త్రాగటానికి కాచి చల్లార్చిన నీటిని మాత్రమే ఇవ్వాలి. తాజాగా వండిన శాఖాహార (VEGITARIAN) భోజనాన్ని ఇవ్వాలి. ఎక్కువగా సగ్గుబియ్యం జావా, రాగి జావ, మజ్జిగ లాంటి ద్రవ పదార్దాలను ఇవ్వాలి. ఆపిల్ , అరటిపండు లాంటి పళ్ళు తినచ్చు. బలవంతంగా ఆహరం తినిపించకండి, పళ్ల రసాలు ఇవ్వదు.

3.) వీలైనంత విశ్రాంతి తీసుకోనివ్వండి, టీవీ ఫోన్ వాడకాన్ని తగ్గించటానికి ప్రయత్నించండి.

4.) ఎన్ని గంటలకొకసారి urine పోస్తున్నారో గమనించండి.

5.) శరీర ఉష్ణోగ్రత చూసినప్పుడల్లా సమయంతో సహా ఒక పుస్తకంలో వ్రాసి ఉంచండి ,దీని వల్ల జ్వరం తీవ్రత పెరుగుతుందో తగ్గుతోందో మీకే అర్థమవుతుంది.

6.) చిన్న పిల్లలలో Pulseoxymeter పెట్టి చూడటం కష్టం, ఒక వేళ వీలైతే రోజుకు మూడు సార్లు చూసి అదే పుస్తకం లో వ్రాయండి.

7.) దగ్గు జలుబు కు మాత్రం Saline nasal drops వాడవచ్చు.

8.) జ్వరం వాటిమీద వున్నప్పుడు పిల్లలు నీరసంగా ఉండటం సహజం, జ్వరం తగ్గిన సమయంలో పిల్లలు ఉత్సాహంగా ఆడుతున్నారో లేదో గన్మనించండి, ఒకవేళ active గా ఉంటే కంగారు అవసరం లేదు.

9.) జ్వరం ఉన్నప్పుడు పిల్లలకు ఆకలి తక్కువ గా ఉండటం సహజం, కరోనా జ్వరం తగ్గాక కూడా ఒక రెండు వారాలు పిల్లలు ఆహరం మీద ఆసక్తి చూపించారు.

మీరు మీ బిడ్డను ఎప్పుడు వైద్యుడి వద్దకు తీసుకెళ్లాలి? 

క్రింది లక్షణాలలో ఏఒక్కటి ఉన్న మీ పిల్లల డాక్టరుగారికి చూపించండి.

1.) పిల్లవాడు చాలా తక్కువ ఆహారాన్ని తీసుకుంటుంటే మరియు తల్లి పాలు లేదా నీరు త్రాగడానికి కూడా ఆసక్తి చూపకపోతే.

2.) జ్వరం 102.5° F / 39° C కు మించి . ఈ ఉష్ణోగ్రత కంటే ఎక్కువ ఉంటే అధిక జ్వరం / high grade fever అంటారు.

3.) బాబు లేదా పాప ఆరు గంటలలో కనీసం ఒక్కసారి కూడా పాస్ పోయకపోయినా.

4.) జ్వరం 2 రోజులకు/ 48 గంటలకు మించి ఉంటె.

5.) చర్మంపై దద్దుర్లు/ rash ఉన్న జ్వరం.

6.) ఆగకుండా వాంతులు లేదా motions అవుతుంటే.

అత్యవసరంగా డాక్టర్ గారినిని కలవాల్సిన/ హాస్పిటల్ లో అడ్మిట్ చెయ్యాల్సిన సందర్భాలు:

1.) పిల్లవాడు ఆయాసపడుతున్నా,పక్కలు/డొక్కలు ఎగరేస్తున్న.

2.) పిల్లవాడికి ఫిట్స్ వచ్చినా లేదా కళ్ళు తేలవేసినా.

3.)  Pulse oximeter లో ఆక్సిజెన్ శాతం 95 కంటే తక్కువ చూపిస్తున్న.

4.) ఆరు గంటలకుమించి పాస్ పోయకపోయినా.

5.) పిల్లవాడు అసాధారణంగా ప్రవర్తిస్తుంటే లేదా ఎక్కువ సమయం నిద్రపోతుంటే లేదా మగతగా ఉంటే.

తల్లిదండ్రులు సాధారణంగా చేసే తప్పులు:

1.) డైరెక్ట్ గా మెడికల్ షాప్ కి వెళ్లి మందులు తెచ్చి వాడటం, అందులో అనవసరమైన ఆంటిబయోటిక్స్(antibiotics) ఉండటం, ఓవర్ డోస్ లో మందులు ఇవ్వటం.

2.)శరీర ఉష్ణోగ్రత/temperature చూడకుండా వొళ్ళు వెచ్చబడగానే paracetmol ఇవ్వటం, లేదా రోజులతరబడి PARACETMOL ఇస్తూవుండటం.

3.) Paracetmol లో డ్రాప్స్(Drops) మరియు ,125 పవర్, 250 పవర్, 500 పవర్ syrups ఉంటాయని తెలియక లేక తికమకపడి తప్పు డోస్ లో మందు ఇవ్వటం, దానివలన జ్వరము తగ్గకపోవడం లేక ప్రమాదకరమైన డోస్ లో మందు ఇవ్వటం.

4.) పిల్లలకు బలవంతం గా వేడి నీటి ఆవిరి లేదా Nebuliser పెట్టడం(పిల్లలు వుక్కిరిబిక్కి కావచ్చు). జలుబుకు Nebuliser వైద్యం కాదని తెలుసుకోండి.

5.) బలవంతంగా ఆహరం పెట్టటం దానివలన వాంతులు అవ్వటం, తాగటానికి సరిపడా నీరు లేదా ద్రవపదార్థాలు ఇవ్వకపోవటం

6.) పిల్లల డాక్టర్ సలహా లేకుండా CT స్కాన్ తీయించటం, దానివల్ల పిల్లలు రేడియేషన్ ప్రభావానికి గురికావటం.

7.) డాక్టర్ గారిని కలిసినప్పుడు కరోనా అనుమానాని వ్యక్తపరచకుండా దాచటం.

8.) ఇంట్లో పెద్దలకు వాడుతున్న కరొనమందులనే పిల్లలకు కూడా వెయ్యటం.


ఒక వేళ ఇంట్లొ  పెద్దవారికి ఎవరికైన COVID పాజిటివ్ వస్తే పిల్లలలో తీసుకోవలసిన జాగ్రత్తలు:

చేయవలసినవి: 

1.) పిల్లలకు ఆరోగ్యవంతమైన, ఇంట్లోనే తయారుచేసిన ఆహారాన్ని, మరియు పళ్ళని అందించటం. కాచి చల్లార్చిన నీటినే త్రాగటానికి ఇవ్వటం.

2.)ఒక రెండు వారల వరకు ఇంట్లోనే వీలైతే వేరే గదిలో ఉంచటం, బయటకు ఆటలకు కానీ, బడికి కానీ, ట్యూషన్ కి కాని పంపకపోవటం( తద్వారా వేరే పిల్లలకు సంక్రమించే ప్రమాదం అరికట్టడం).

3.) తరచుగా మంచి నీరు లేదా జావా ఇవ్వటం.

4.) ఒక వేళ సంవత్సరం లోపు పిల్లలు ఉన్న తల్లి కి పాజిటివ్ వస్తే, తల్లి మాస్క్ ధరించి తల్లి పాలు ఇవ్వటం.

5.) ఇంట్లో తల్లి కాకుండా ఇంకెవరైనా పాజిటివ్ వస్తే తప్పక మాస్క్ ధరించటం, పిల్లలకు 14 రోజులు వరకు దూరంగా ఉండటం.


8919994819 (WhatsApp only).


Dr Srinivas Rekapalli

MD, FNB. Trained in Chennai Kanchi Kamakoti CHILDS Trust hospital.

Consultant and Head of ICU

Nori hospital Vijayawada.

From Bhimavarm.


8919994819 ( WhatsApp only)

అత్యవసర సమయం లో మీ డాక్టరుగారికి కానీ 108 కి కానీ కాల్ చేయటానికి సంకోచించకండి. లెదా  89199 94819 కి డాక్టర్ గారి సలాహా కోసం వాట్సాప్ చేయండివ్యాసంలో తెలుపపడిన వివరాలు కేవలం తల్లిదండ్రులలో అవగాహన కల్పించడానికి మాత్రమే. ఎల్లప్పుడూ మీ బాబుని లేదా పాపని చూస్తున్న డాక్టరుగారి సలహాని అనుసరించండి.
 ఈ వ్యాసంలో లో విషయాలు డాక్టర్లు అందరూ చెప్పేవే కాని తల్లిదండ్రుల వీలుకోసం ఇక్కడ పొందుపరచబడ్డాయి.

ఈ వ్యాస రచయిత, Dr Srinivas Rekapalli MD, FNB (ఆంధ్ర మెడికల్ కాలేజీ/ KGH) , పిల్లల వైద్యం లో 11 సంవత్సరాలు అనుభవం కలిగిన వారు మరియు పిల్లలలో అతితీవ్రమైన జబ్బులకు ICU లో వైద్యం చేయటంలో ఫెలోషిప్(FNB కంచికామకోటి చైల్డ్ ట్రస్ట్ హాస్పిటల్ chennai) చేసారు.


  

Disclaimer: This document cannot be used for any medico-legal purpose.




కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

జ్వరం తో బాధపడుతున్న పిల్లలకి: ఎప్పుడు ఇంట్లోనే ఉంటూ చూసుకోగలము మరియు ఎప్పుడు వైద్యుడిని సందర్శించాలి? When can we treat a child with fever at home?

Part 2 పిల్లలలో టీకాలు వేయించాలా? ఏవి వేయించాలి? ఎక్కడ వేయించాలి? రెండొవ భాగం. Guide book to help parents with vaccination 2.

How can we treat children who have symptoms of COVID a home?