పోస్ట్‌లు

అక్టోబర్, 2020లోని పోస్ట్‌లను చూపుతోంది

ఆరు నెలలలోపు వయసున్న పిల్లలగురించి తల్లిదండ్రులు తెలుసుకోవలసిన ముఖ్యమైన విషయాలు. Important things to know while raising an infant(until 6 months of age).

చిత్రం
  పాపాయికి ఒక నెల వయసు నిండగానే ఒక ముఖ్యమైన మైలురాయి దాటినట్లు. తల్లిలో పాపను తాను చూసుకోగలననే ధైర్యం వస్తుంది. ముఖ్యంగా చూడటానికి వచ్చేవాళ్ళు తగ్గుతారు, సమస్యలు, సలహాలు తగ్గుతాయి. కాని కొన్ని ప్రత్యేకమైన ఇబ్బందులు ఈ వయసులోనే మొదలవుతాయి. కాబట్టి తల్లిదండ్రులకు ఏది సహజం , ఏది ప్రమాదం, ఎప్పుడు వెంటనే హాస్పిటల్ కి తీసుకెళ్ళలో తెలుపటం కోసం ఈ వ్యాసం. 6 నెల ల లోపు పిల్లలకు ఏది సహజం? ) ప్రతీనెలా అర కేజి నుండి కేజి వరకు బరువు పెరుగుతారు. ఐదు నెలలు నిండేసరికి పుట్టిన బరువుకి రెట్టింపు బరువవుతారు. ) తల్లి పాలు లేదా డబ్బా పాలు తాగిన తరువాత మూడు నుండి ఐదు గంటల వరకు పడుకుంటారు. ఒక వేళ గంట గంటకు లేచి ఏడుస్తుంటే పాలు సరిపొవట్లేదని అర్థం. ) నెల వయసు నుండి ఐదు నెలలల వయసు లోపు పిల్లలు ఒక్కొక్కసారి ఉన్నట్లుండి ఏడవటం మొదలు పెడతారు. గంట నుండి రెండు గంటలవరకు ఏడుస్తారు. అల ఏడుస్తున్నప్పుడు పొట్ట బిగుతుగా అనిపిస్తుంది. కొంత మంది పిల్లలు గుక్క తిప్పకుండా ఏడుస్తారు. ఇది సాధారణంగా సాయంత్రం వేళ నుండి అర్థరాత్రి మధ్యలో జరుగుతుంటుంది. ప్రతీ రోజూ అదే సమయానికి మళ్ళి ఏడుపు మొదలుపెడుతుంటారు. దీనినే ఈవెనింగ్

నెల లోపు వయసున్న పిల్లల తల్లిదండ్రులకు ముఖ్యమైన సూచనలు. Essential information for parents of a new born baby.

చిత్రం
 ఇంట్లో బాబు లేదా పాపాయి పుట్టగానే ఎంతో ఆనందంతో పాటు ఎన్నో సంశయాలు ఉంటాయి. మొదటి సారి పిల్లలకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు కంగారు మరింత ఉంటుంది. అది సహజం. ఇంట్లో పెద్ద వారు, పుట్టిన బిడ్డను చూడటానికి వచ్చినవారు తోచిన సలహాలు చెప్తుంటారు. వాటిలో ఏది నమ్మాలో ఏది అనుసరించాలో తెలియక తల్లిదండ్రులు మరింత భయపడతారు. అలాంటి తల్లిదండ్రుల వీలు కోసం ఈ వ్యాసం లో క్లుప్తంగా ఏం చెయ్యాలో ఏం చేయకూడదో , ఎప్పుడు వెంటనే డాక్టర్ గారిని కలవాలో చెప్తాను. నెలలోపు పిల్లలకు ఏది సహజం? ) పుట్టిన పిల్లల బరువు సాధారణంగా 2.5 కిలోల నుండి 4 కిలోలవరకు ఉంటుంది. మొదటి వారం పుట్టిన బరువులో పది శాతం తగ్గడం సహజం. పుట్టిన 10 రోజులకు పుట్టిన బరువుని మళ్ళి చేరుకుంటారు. ఆ తరువాత మూడు నెలల వరకు వారానికి 200 గ్రాముల నుండి 300 గ్రాముల వరుకు పెరుగుతుంటారు అంటే నెలకు ముప్పావు కేజీ నుండి ఒక కిలో పెరుగుతారన్నమాట.  ) బాబు లేదా పాప కి తల్లి పాలు వీలైనంత త్వరగా మొదలు పెట్టాలి. సాధారణ కాన్పు అయితే వెంటనే మొదలు పెట్టచ్చు. సిసేరిన్ కాన్పు అయితే తల్లికి కొంచం ఓపిక రాగానే రొమ్ముపాలు మొదలుపెట్టాలి. ) పిల్లవాడు ఏడ్చినప్పుడల్లా రొమ్ము

Part 2 పిల్లలలో టీకాలు వేయించాలా? ఏవి వేయించాలి? ఎక్కడ వేయించాలి? రెండొవ భాగం. Guide book to help parents with vaccination 2.

చిత్రం
  మొదటి భాగం తరువాయి: ప్రతీ టీకాను ఆమోదించే ముందు ఎన్నో సంవత్సరాలు పరీక్షలు చేస్తారు.  చేసి ప్రమాదకరం కాదు మరియు పనిచేస్తాయి అని నిరూపింపబడిన తరువాతే పిల్లలో వేయటానికి అనుమతిస్తారు. టీకాల వల్ల వచ్చే దుష్పరిణామాలను ఎలా గుర్తించాలి ఎప్పుడు హాస్పిటల్ కి తీసుకు వెళ్ళాలి? టీకాలు సురక్షితమైనవి మరియు మీ పిల్లల ఆరోగ్యానికి వారి జీవితమంతా ముఖ్యమైన ప్రయోజనాలను అందిస్తాయి. చాలా అరుదుగా లక్షల్లో ఒకరికి టీకా తరువాత ప్రమాదకరమైన సైడ్ ఎఫెక్ట్స్ రావచ్చు.అవి వెంటనే గుర్తిస్తే తగిన వైద్యం చేయటానికి అవకాశం ఉంటుంది 1.) టీకా వేయగానే పెదాలు కళ్ళు వాయటం, చర్మం మీద దద్దుర్లు రావటం, ఆయాసం రావటం(Aanphylaxis).  2.)  విపరీతమైన జ్వరం రావటం(>102 F), Paracetmol తో జ్వరం తగ్గకపోవడం . 3.) రెండు రోజులకు మించి జ్వరం ఉండటం. 4.) ఫిట్స్ రావడం లేదా పిల్లాడు మగతగా ఉండటం 5.) ఒక రోజుకంటే ఎక్కువ చిరాకుగా ఏడుస్తూ ఉండటం. 6.) టీకా వేసిన దగ్గర నొప్పితో వాపు వారానికి పైగా ఉండటం లేదా వాపు పెరుగుతూ ఉండటం. పిల్లలో దెబ్బ తగిలితే TT  ఇంజక్షన్ చేయించాలా? క్రమం తప్పకుండా టీకాలు వేయించిన పిల్లలకి 15 సంవత్సరాల వరకు దెబ్బలు తగిలాక ఇవ్వాల్స