Part 2 పిల్లలలో టీకాలు వేయించాలా? ఏవి వేయించాలి? ఎక్కడ వేయించాలి? రెండొవ భాగం. Guide book to help parents with vaccination 2.
మొదటి భాగం తరువాయి:
ప్రతీ టీకాను ఆమోదించే ముందు ఎన్నో సంవత్సరాలు పరీక్షలు చేస్తారు. చేసి ప్రమాదకరం కాదు మరియు పనిచేస్తాయి అని నిరూపింపబడిన తరువాతే పిల్లలో వేయటానికి అనుమతిస్తారు.
టీకాల వల్ల వచ్చే దుష్పరిణామాలను ఎలా గుర్తించాలి ఎప్పుడు హాస్పిటల్ కి తీసుకు వెళ్ళాలి?
టీకాలు సురక్షితమైనవి మరియు మీ పిల్లల ఆరోగ్యానికి వారి జీవితమంతా ముఖ్యమైన ప్రయోజనాలను అందిస్తాయి.
చాలా అరుదుగా లక్షల్లో ఒకరికి టీకా తరువాత ప్రమాదకరమైన సైడ్ ఎఫెక్ట్స్ రావచ్చు.అవి వెంటనే గుర్తిస్తే తగిన వైద్యం చేయటానికి అవకాశం ఉంటుంది
1.) టీకా వేయగానే పెదాలు కళ్ళు వాయటం, చర్మం మీద దద్దుర్లు రావటం, ఆయాసం రావటం(Aanphylaxis).
2.) విపరీతమైన జ్వరం రావటం(>102 F), Paracetmol తో జ్వరం తగ్గకపోవడం.
3.) రెండు రోజులకు మించి జ్వరం ఉండటం.
4.) ఫిట్స్ రావడం లేదా పిల్లాడు మగతగా ఉండటం
5.) ఒక రోజుకంటే ఎక్కువ చిరాకుగా ఏడుస్తూ ఉండటం.
6.) టీకా వేసిన దగ్గర నొప్పితో వాపు వారానికి పైగా ఉండటం లేదా వాపు పెరుగుతూ ఉండటం.
పిల్లలో దెబ్బ తగిలితే TT ఇంజక్షన్ చేయించాలా?
క్రమం తప్పకుండా టీకాలు వేయించిన పిల్లలకి 15 సంవత్సరాల వరకు దెబ్బలు తగిలాక ఇవ్వాల్సిన అవసరం ఉండదు, ఎందుకంటె డీ పీ టి(DPT) టీకా లో TT ఉంటుంది.
నెలలు నిండకుండా పుట్టిన లేదా బరువు తక్కువగా పిల్లలో (Premature/ preterm babies) టీకాలు ఎప్పుడు వేయించాలి?
ఈ పిల్లల్లో బీసీజీ టీకా హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యే రోజున వేయించి తరువాత టీకాలు మిగిలిన పిల్లలాగానే వయసు ప్రకారం వేయించాలి.
రేబిస్(Rabes) టీకా ఎవరికి వేయిచాలి?
ఇంట్లో కుక్కల్ని కాని పిల్లుల్ని కాని పెంచుతుంటే ఆ ఇంట్లో పిల్లలకు తప్పనిసరిగా రేబిస్ టీకా వేయించాలి.
ఒకవేళ టీకాలు మిస్ అయితే ఏం చెయ్యాలి?
నేను పైన తెలిపిన ప్రతీ టీకా పిల్లలకు తప్పనిసరిగా వేయించాలి. ఒక్క్కొక్కసారి అనివార్య కారణాల వలన టీకాలు మిస్ అవ్వచ్చు. అలాంటి సమయంలో తరువత వీలైన వెంటనే ఏవేవయితే పిల్లవాడు మిస్ అయ్యాడో అవి అన్ని ఒక పద్ధతి ప్రకారం మళ్ళి వేయించాలి. టీకాల పట్టిక మళ్ళి మొదటినుండి మొదలుపెట్టాల్సిన పని లేదు. ఈ విషయం లో మీ డాక్టర్ గారు సలహా పాటించి కొత్త పట్టిక ప్రకారం తప్పకుండా టీకాలు వేయించండి.
విదేశాలలో పుట్టిన పిల్లలకు లేదా విదేశాలు వెళ్లే అవసరమున్న పిల్లలకు టీకాలు పట్టిక లో మార్పు ఉంటుందా ?
అవును, పిల్లలో ఏ ఏ టీకాలు వేయాలన్నది పెరిగే దేశం మరియు ప్రాంతం బట్టి కొద్దిగా మారుతుంది. ఉదాహరణకు Europe మరియు అమెరికా లో బీసీజీ,varicella(chicken pox vaccine) వేయరు. ఇక్కడికి వచ్చాక వేయించాలి.
ఇక్కడి నుండి అక్కడకు వెళ్ళ వలసిన పిల్లలకు Meningococcal టీకా వేయించాలి.
కాబట్టి మీ పిల్లలు విదేశాలలో పుట్టి మన దేశానికి వచ్చినా లేదా ఇక్కడ పుట్టి అక్కడికి వెళ్తున్న మీ పిల్లల డాక్టర్ గారిని అడిగి అవసరమైనా అదనపు టీకాలు వేయించండి.
మొదటి భాగం లో ఆరు నెలల లోపు వేయించాల్సిన టీకాల గురించి విపులం గా వ్రాసాను. ఇక్కడ ఆరు నెలల నుండి పెద్దయ్యేవరకు వేయించాల్సిన టీకాల గురించి చెప్తాను.
ఆరు నెలల(6 months) వయసుకి వేయించాల్సిన టీకాలు:
1.) ఇన్ఫ్లుఎంజా(Influenza) లేదా ఫ్లూ వాక్సిన్/H1N1/swine flu vaccine: ఈ టీకా నిమోనియాను కలిగించే ఇన్ఫ్లుఎంజా అను క్రిమి నుండి రక్షణ ఇస్తుంది. ఆరు నెలల వయసు దాటాక మొదటి సారి వేయించాలి, ఒక నెల తరువాత ఇంకొక్క డోస్ వేయించాల్సి ఉంటుంది. ఆ తరువాత సంవత్సరానికి ఒక్క సారి ఐదు సంవత్సరాలు నిండే వరకు వేయించాలి. ఈ టీకా కేవలం మీ పిల్లల వైద్యుని వద్ద మాత్రమే లభిస్తుంది. COVID సమయం లో మీ పిల్లలకు ఈ టీకా తప్పనిసరిగా వేయించండి. ఈ టీకా వేయించిన రెండు రోజులలోపు కొద్దిపాటి జ్వరం రావచ్చు.
2.) టైఫాయిడ్ టీకా(Typhoid TCV) : ఈ టీకా ఆరు నెలల వయసు పూర్తి అయిన తరువాత వేయించాలి. ఇది టైఫాయిడ్ నుండి రక్షణ ఇస్తుంది. మీ పిల్లల వైద్యుని వద్ద మాత్రమే లభిస్తుంది.
ఏడు నెలల(7 Months) వయసుకి వేయించాల్సిన టీకాలు:
1.) ఇన్ఫ్లుఎంజా(Influenza/H1N1) లేదా ఫ్లూ టీకా రెండొవ డోసు. మొదటి డోసుకీ రెండొవ డోసుకీ కనీసం ఒక నెల వ్యవధి ఉండాలి. ఈ టీకా వేయించిన రెండు రోజులలోపు కొద్దిపాటి జ్వరం రావచ్చు.
తొమ్మిది నెలల(9 months) వయసుకి వేయించాల్సిన టీకాలు:
1.) ఎం ఎం ఆర్ (MMR) టీకా: ఇది Measels/మీజిల్స్(తట్టు), Mumps/ ముమ్ప్స్(గవదబిళ్ళలు) మరియు Rubella రుబెల్లా అను మూడు ప్రమాదకరమైన వైరస్ ల నుండి రక్షణ ఇస్తుంది. ఈ టీకా పిల్లలలో చాలా ముఖ్యమైనది. తొమ్మిది నెలల వయసు పూర్తీ అయిన తరువాతే వేయించాలి. ప్రభుత్వం ఇచ్చే టీకాలలో ఇది ఎం ఆర్(MR- Measels & rubella) గా పిలవబడుతుంది మరియు మీజిల్స్(తట్టు), Rubella రుబెల్లా అను రెండు క్రిముల నుండి రక్షణ ఇస్తుంది. ఈ టీకా ఇచ్చిన వారం రోజుల లోపు కొద్దిపాటి జ్వరం మరియు చర్మం మీద ఎర్రటి దద్దుర్లు(rash) రావచ్చు.
సంవత్సం(1 year) వయసు లేదా మొదటి పుట్టిన రోజు తరువాత వేయించాల్సిన టీకాలు:
1.) హెపటైటిస్ ఏ/Hepatitis A : పిల్లలలో కామెర్లకు కారణమైన వైరస్ల లో ముఖ్యమైనది హెపటైటిస్ ఏ. ఈ టీకా ఇవ్వటం వలన హెపటైటిస్ A క్రిమి నుండి రక్షణ లభిస్తుంది. ఈ టీకా కేవలం మీ పిల్లల వైద్యుని వద్ద మాత్రమే లభిస్తుంది.
2.) జాపనీస్ ఏన్కెఫలైటిస్/Japanese Encephaltis JE: మన దేశంలో ఎంతోమని పిల్లలు ఈ క్రిమి వలన మెదడువాపుకి గురైయ్యి ప్రాణాలు కోల్పోతున్నారు. టీకా ఇవ్వటం వలన రక్షణ పొందచ్చు. ఆంద్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ టీకాని ఇస్తుంది. తప్పనిసరిగా పట్టిక ప్రకారం రెండు డోసులు వేయించండి.
పదమూడు నెలల(1 year 1 month) వయసు తరువాత వేయించాల్సిన టీకాలు:
జాపనీస్ ఏన్కెఫలైటిస్/JE టీకా రెండొవ డోసు. మొదటి డోసుకీ రెండొవ దోసుకీ కనీసం ఒక నెల వ్యవధి ఉండాలి.
పదిహేను నెలల(1 year 3 months) వయసు తరువాత వేయించాల్సిన టీకాలు:
1.) ఎం ఎం ఆర్ (MMR) టీకా : రెండొవ డోసు.
2.) వారిసెల్లా లేదా పొంగు టీకా/ Varicella/chicken pox vaccine: ఇది పిల్లలలో అమ్మవారు లేదా పొంగు రాకుండా ఒకవేళ వచ్చినా తీవ్రత తక్కువగా ఉండే లాగా రక్షణ ఇస్తుంది. తప్పనిసరిగా మీ పిల్లలకు ఈ టీకా ఇప్పించండి. ఈ టీకా కేవలం మీ పిల్లల వైద్యుని వద్ద మాత్రమే లభిస్తుంది.
3.) న్యుమోకాకల్ టీకా/ Pneumococcal vaccine booster dose : బూస్టర్ డోసు తప్పనిసరిగా వేయించాలి. ముందు వ్యాసం లో చెప్పినట్లు Prevenar లేదా synflorex రెండిటీలో ఎదో ఒకటి వేయించచ్చు కాని ముందు ఏది వేయించారో అదే వేయిస్తే మంచిది.
పదహారు నెలల(1 year 4 months) వయసు తరువాత వేయించాల్సిన టీకాలు:
1.) డీ పీ టి బూస్టర్/DPT booster dose.
2.) IPV / పోలియో టీకా బూస్టర్ డోసు.
3.) హిబ్ బూస్టర్.
పై మూడు టీకాలు కలిపి కాంబినేషన్ వాక్సిన్(Pentaxim) గా మీ పిల్లల వైద్యుని వద్ద లభిస్తాయి. ప్రభుత్వ టీకా పట్టికలో కేవలం
డీ పీ టి మాత్రమే లభిస్తుంది.
పద్దెనిమిది నెలల (1 year 6 months) వయసు తరువాత వేయించాల్సిన టీకాలు:
హెపటైటిస్ ఏ/Hepatitis A రెండొవ డోసు.
ఇన్ఫ్లుఎంజా(Influenza/H1N1) లేదా ఫ్లూ టీకా.
తరువాత ఐదు సంవత్సరాలు నిండేంతవరకూ సంవత్సరానికి ఒకసారి ఫ్లూ టీకా/influenza vaccine వేయించాలి.
నాలుగు సంవత్సరాలు వయసు తరువాత( 4- 6 years of age) వేయించాల్సిన టీకాలు:
1.) డీ పీ టి రెండొవ బూస్టర్/DPT 2nd booster dose(Boostrix).
2.) వారిసెల్లా లేదా పొంగు టీకా/ Varicella/chicken pox vaccine: రెండొవ డోసు. తప్పనిసరిగా మీ పిల్లలకు ఈ టీకా ఇప్పించండి. ఈ టీకా కేవలం మీ పిల్లల వైద్యుని వద్ద మాత్రమే లభిస్తుంది.
తొమ్మిది సంవత్సరాలు వయసు తరువాత( 9 years of age) వేయించాల్సిన టీకా :
HPV హ్యూమన్ పాపిల్లోమా వైరస్ టీకా: అనగా స్త్రీలలో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ను(Cervical cancer) కలిగించే క్రిమి. ఈ టీకా కేవలం ఆడపిల్లలకు మాత్రమే. ప్రతీ అమ్మాయి ఈ టీకా తప్పక తీసుకోవటం ద్వారా ప్రమాదకరమైన సెర్వికల్ కాన్సర్ నుండి రక్షణ పొందుతారు. ఈ టీకా కేవలం మీ పిల్లల వైద్యుని వద్ద లేదా మీ స్త్రీ వైద్యుల (gynecologist) వద్ద మాత్రమే లభిస్తుంది.
తొమ్మిది సంవత్సరాలు ఆరు నెలల వయసు తరువాత( 9 years 6 months of age) వేయించాల్సిన టీకా :
HPV హ్యూమన్ పాపిల్లోమా వైరస్ టీకా రెండొవ డోసు . మొదటి డోసుకీ రెండొవ డోసుకీ కనీసం ఆరు నెలల వ్యవధి ఉండాలి.
పది సంవత్సరాలు వయసు తరువాత( 10 years of age) వేయించాల్సిన టీకా :
Tdap : ఇది డీ పీ టి బూస్టర్/DPT booster dose(Boostrix). ఈ టీకా తో చిన్న పిల్లల లో వేయించాల్సిన టీకా లు పూర్తవుతాయి.
టీకాల యొక్క అంచనా ఖరీదు approximate cost(2020 వ్యాసం రాసే నాటికి ఆంధ్రప్రదేశ్ లో) ఈ సమాచారం కేవలం తల్లిదండ్రులు సిద్దపడి ఉంటారని మాత్రమే. ఇంజక్షన్ చేసే పరికరాలకి చేసినందుకు హాస్పిటల్ ని బట్టి రుసుములు ఉంటాయి.
BCG 100/-
Hepatitis B 100/-
Hexaxim (acellular/painless) (DPT+IPV+HIB+Hepatitis B) 3900/-
Easisix (whole cell)(DPT+IPV+HIB+Hepatitis B) 2400/-
Pneumococcal vaccine
Prevenar 3800/-
Synflorex 1800/-
Rotarix 1300/-
Influenza influvac Tetra 1680/-
Typhoid Conjugated Vaccine TCV 1820/-
MMR 200/-
Hepatitis A 2100/-
Japanese Encephalitis 700/-
Varicella 2250/-
Pentaxim used at 16 months (DPT+IPV+HIB)- 2500/-
Boostrix(DaPT) used at 5 yrs and 10 yrs age 1200/-
HPV(Gardasil) 3250/-
Meningococcal vaccine (Menectra only for kids travelling abroad) 4950/-
మీ బాబు/పాప టీకాల పట్టిక ఎపుడూ జాగ్రత్తగా భద్రపరచుకోండి. మీ బాబు/పాప టీకాల వివరాల కోసం మీ పిల్లల డాక్టర్ గారిని సంప్రదించండి లేదా 89199 94819 కి డాక్టర్ గారి సలాహా కోసం వాట్సాప్ చేయండి. ఈ విషయంలో ఇంకా సందేహాలు ఉంటె క్రింది కామెంట్స్ లో పెట్టండి, నివృత్తి చేస్తాను.https://childhealthtelugu.blogspot.com/2020/09/guide-book-to-help-parents-with.html
వ్యాసంలో తెలుపపడిన వివరాలు కేవలం తల్లిదండ్రులలో అవగాహన కల్పించడానికి మాత్రమే. ఎల్లప్పుడూ మీ బాబుని లేదా పాపని చూస్తున్న డాక్టరుగారి సలహాని అనుసరించండి.
ఈ వ్యాసంలో లో విషయాలు డాక్టర్లు అందరూ చెప్పేవే కాని తల్లిదండ్రుల వీలుకోసం ఇక్కడ పొందుపరచబడ్డాయి.
ఈ వ్యాసం లోని వివరాలు ఇండియన్ అకాడమీ అఫ్ పెడియాట్రిక్స్ (IAP) మరియు National Immunization Program నుండి సేకరించబడినవి.https://iapindia.org/index.php.
క్రింద IAP Vaccination schedule మరియు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ టీకాల పట్టికలు జాతహపర్చబడినవి.
ఈ వ్యాస రచయిత, డాక్టర్ శ్రీనివాస్ MD(ఆంధ్ర మెడికల్ కాలేజీ/ KGH) , పిల్లల వైద్యం లో 10 సంవత్సరాలు అనుభవం కలిగిన వారు మరియు పిల్లలలో అతితీవ్రమైన జబ్బులకు ICU లో వైద్యం చేయటంలో ఫెలోషిప్(FNB కంచికామకోటి చైల్డ్ ట్రస్ట్ హాస్పిటల్ chennai) చేసారు.
Disclaimer: This document cannot be used for any medico-legal purpose.
Dr. Srinivas MD
\
Thank you for giving very usefull information sir
రిప్లయితొలగించండిVery useful information doctor. Thank you
రిప్లయితొలగించండిThank for the valuable information sir.
రిప్లయితొలగించండిI believe the eligibility to get meningococcal conjugate vaccine is 9 months now in india and upon the discussion with parents.
Yes, 9months is minimum age. It is recommended in certain High risk children like kids with sickle cell anemia or had splenectomy in Child if given for any indication should receive 2 doses of menactra 8 weeks apart.
రిప్లయితొలగించండిBut government have licensed it's use for age of above 2 years only.
Yes, 9months is minimum age. It is recommended in certain High risk children like kids with sickle cell anemia or had splenectomy or diagnosed with compliment deficiency at this age. Child if given for any indication should receive 2 doses of menactra 8 weeks apart.
రిప్లయితొలగించండిHowever government have licensed it's use for age of above 2 years only.