పోస్ట్‌లు

సెప్టెంబర్, 2020లోని పోస్ట్‌లను చూపుతోంది

జ్వరం తో బాధపడుతున్న పిల్లలకి: ఎప్పుడు ఇంట్లోనే ఉంటూ చూసుకోగలము మరియు ఎప్పుడు వైద్యుడిని సందర్శించాలి? When can we treat a child with fever at home?

చిత్రం
   ఇంట్లో పిల్లాడికి జ్వరం రాగానే తల్లిదండ్రులకు ఉండే కంగారు ఒక డాక్టర్ గా మరియు ఇద్దరు పిల్లల తండ్రిగా నేను అర్థం చేసుకోగలను. ఆ పరిస్థితిలో తల్లిదండ్రులకు మొదట వచ్చే సంశయం హాస్పిటల్ కి తీసుకెళ్లాలా లేక కొంత సమయం వేచిచూడాలా అని. అందుకే ఎప్పుడు ఇంట్లో చూసుకోవచ్చు ఎప్పుడు హాస్పిటల్ కి తీసుకెళ్ళాలి అన్న విషయం తెలిసి ఉండటం తప్పనిసరి. పిల్లల్లో జ్వరం తో తల్లిదండ్రులకు చాలా కంగారు ఉన్నప్పటికీ, అందులో చాలామందికి ఇంట్లోనే సురక్షితంగా వైద్యం చెయ్యవచ్చు. ఇప్పుడు మీరు చదవబోయే వ్యాసంలో పిల్లలకి ఎప్పుడు ఇంట్లో వైద్యం చెయ్యవచ్చు ఎప్పుడు తప్పనిసరిగా డాక్టర్ గారిని కలవాలి అన్న విషయాలను తెలుసుకుందాం. చిన్న పిల్లల్లో నుదురు, పొట్ట, అరిచేతులు,పాదాలు వెచ్చగా ఉండటం సహజం, దానినే జ్వరం అని తల్లిదండ్రులు కంగారు పడుతుంటారు. పిల్లాడి ఉష్ణోగ్రత/temperature 100° F లేదా 38° C కంటే ఎక్కువ ఉంటేనే జ్వరం ఉన్నట్లు. ఇంట్లోనే ఉంటూ, చూడగలిగే/ చికిత్స చేయగల జ్వరం : జ్వరం అనేది వ్యాధికి వ్యతిరేకంగా శరీరం చేసే పోరాటం. ఇది ఒక లక్షణం, ఒక వ్యాధి కాదు.జ్వరం ఉన్నప్పుడు పిల్లలు నీరసంగా ఉన్నప్పటికీ, ఉష్ణోగ్రత 103° F (లేదా

Part 1 పిల్లలలో టీకాలు వేయించాలా? ఏవి వేయించాలి? ఎక్కడ వేయించాలి? మొదటి భాగం. Guide book to help parents with vaccination 1.

చిత్రం
ఇది చాలా ముఖ్యమైన సమాచారం,  మరియు తెలియపరచాల్సిన వివరాలు ఎక్కువ ఉండటం వలన రెండు భాగాలుగా విభజించటమైనది.   టీకాలు అంటే చిన్నపిల్లలని హాస్పిటల్కి తీసుకెళ్ళి ఒకే రోజు రెండు మూడు సూదులు పొడిపించాలి, మళ్ళీ వచ్చే జ్వరాన్ని భరించాలి, ఎందుకు పిల్లల్ని ఇంత బాధ పెట్టి మనం ఇబ్బందిపడాలి? తల్లిదండ్రులుగా మన పిల్లలను,  అనారోగ్యానికి గురికాకుండా ఉంచడానికి మనం చేయగలిగినదంతా చేయాలనుకుంటాము .కాని ఈ టీకాలు ఎందుకు వేయించాలి?  ఇదివరకటి కాలంలో (1960వ దశకంలో) వందమంది పిల్లలు పుడితే అందులో పాతికమంది పిల్లలు ఐదు సంవత్సరాలు నిండకముందే చనిపోయేవారు. అదే సమయంలో మన దేశంలో సగటు మనిషి ఆయుర్దాయం 35 సంవత్సరాలు. మరి ఇప్పుడు? వందమంది పిల్లలు  పుడితే వారిలో 97 మంది ఐదు సంవత్సరాలు దాటుతున్నారు మరియు సగటు ఆయుర్దాయం దాదాపు 70 సంవత్సరాలు.ఈ మార్పులకు   పిల్లలో తప్పనిసరిగా టీకాలు వేయించటం 1980ల లో మొదలుపెట్టటం అతిముఖ్యమైన కారణం.  మసూచి(small pox) , పోలియోలను పారద్రోలామంటే అది టీకాల వల్లనే.  ఇపుడు కూడా COVID 19 టీకా కోసమే కదా అందరి ఎదురు చూపు. టీకాలు అంటే ఏమిటి? అనారోగ్యాన్ని నయం చేయడానికి మందులు ఇస్తారు. కానీ టీకాలు

మా బాబు/పాపకి ఆకలి లేదు, సరిగా తినటం లేదు! ఆకలి పెరగటానికి మందులుంటాయా? dietary advice for toddlers

చిత్రం
మా బాబు/పాప సరిగా తినటం లేదు…! మా బాబు బరువు పెరగట్లేదు, సన్నగానే ఉంటున్నాడు, మా పాపకి ఆకలి ఉండదు, ఎప్పుడు ఆటపైనే ధ్యాస, మా పాపకి పాలు తప్ప ఇంక ఏ ఆహరం ఇష్టం ఉండవు, ఏం చేయమంటారు? ఏవైనా మందులు ఉంటే ఇవ్వండి.ఇది ప్రతీరోజు పిల్లల డాక్టర్లు వినే సమస్య. పిల్లలు సరిగా తినకపోవటం నూటికి తొంభై శాతం మంది తల్లులను పీడించే సమస్య.  తొమ్మిది నెలల వయస్సు నుండి నాలుగో సంవత్సరం వచ్చేవరకు ఎదో ఒక సమయం లో మీ పిల్లలు ఆహరం తినటానికి మారం చేయటం మొదలుపెడతారు. కొంత మంది పిల్లలకు ఈ సమస్య చాలా సంవత్సరాలు ఉంటుంది. మనం ఏ జంతువైనా పిల్లల్లకి బలవంతంగా ఆహారం పెట్టడం చూశామా? మరి మనుషులలోనే ఎందుకు ఇలా జరుగుతోంది? అంటే ఆ లోపం పిల్లల ఆరోగ్యం లో లేదు తల్లిదండ్రులు లేదా ఇంట్లో పెద్దవారు చేసే గారంలో ఉంది. అది ఎలా సరిచేసుకోవచ్చో కొన్ని సూచనలు ఈ క్రింది వ్యాసంలో వివరిస్తాను. అసలు సరిగా తినకపోవడం అంటే ఏమిటి? తల్లి వైపునుండి చుస్తే పిల్లలు ఎంత తిన్నా ఎలా తిన్న సరిపడా తినట్లేదనే అనిపిస్తుంది. దీనిని నిర్వచించడం కష్టం. కాని ఒక డాక్టర్ దృష్టిలో మాత్రం ఎప్పుడైతే పిల్లల బరువు పెరుగుదల ఉండదో లేదా పిల్లవాడువయసుకి ఉండాల్సినంత చురుకుగా లే