జ్వరం తో బాధపడుతున్న పిల్లలకి: ఎప్పుడు ఇంట్లోనే ఉంటూ చూసుకోగలము మరియు ఎప్పుడు వైద్యుడిని సందర్శించాలి? When can we treat a child with fever at home?

  ఇంట్లో పిల్లాడికి జ్వరం రాగానే తల్లిదండ్రులకు ఉండే కంగారు ఒక డాక్టర్ గా మరియు ఇద్దరు పిల్లల తండ్రిగా నేను అర్థం చేసుకోగలను. ఆ పరిస్థితిలో తల్లిదండ్రులకు మొదట వచ్చే సంశయం హాస్పిటల్ కి తీసుకెళ్లాలా లేక కొంత సమయం వేచిచూడాలా అని. అందుకే ఎప్పుడు ఇంట్లో చూసుకోవచ్చు ఎప్పుడు హాస్పిటల్ కి తీసుకెళ్ళాలి అన్న విషయం తెలిసి ఉండటం తప్పనిసరి. పిల్లల్లో జ్వరం తో తల్లిదండ్రులకు చాలా కంగారు ఉన్నప్పటికీ, అందులో చాలామందికి ఇంట్లోనే సురక్షితంగా వైద్యం చెయ్యవచ్చు. ఇప్పుడు మీరు చదవబోయే వ్యాసంలో పిల్లలకి ఎప్పుడు ఇంట్లో వైద్యం చెయ్యవచ్చు ఎప్పుడు తప్పనిసరిగా డాక్టర్ గారిని కలవాలి అన్న విషయాలను తెలుసుకుందాం. చిన్న పిల్లల్లో నుదురు, పొట్ట, అరిచేతులు,పాదాలు వెచ్చగా ఉండటం సహజం, దానినే జ్వరం అని తల్లిదండ్రులు కంగారు పడుతుంటారు. పిల్లాడి ఉష్ణోగ్రత/temperature 100° F లేదా 38° C కంటే ఎక్కువ ఉంటేనే జ్వరం ఉన్నట్లు. ఇంట్లోనే ఉంటూ, చూడగలిగే/ చికిత్స చేయగల జ్వరం : జ్వరం అనేది వ్యాధికి వ్యతిరేకంగా శరీరం చేసే పోరాటం. ఇది ఒక లక్షణం, ఒక వ్యాధి కాదు.జ్వరం ఉన్నప్పుడు పిల్లలు నీరసంగా ఉన్నప్పటికీ, ఉష్ణోగ్రత 103° F (లేదా 39.5° C) దాటకపోతే మీ బిడ్డకు సాధారణంగా ఎటువంటి హాని కలిగించదు. మీరు ఇంటి వద్ద థర్మామీటర్తో పిల్లల ఉష్ణోగ్రత ప్రతి ఆరు గంటలకు చుడండి. జ్వరానికి పారాసెటమాల్‌తో కనీసం మొదటి 2 రోజులు ఇంట్లో చికిత్స చేయవచ్చు. తగినంత నీరు లేదా పానీయాలు(కూల్ డ్రింక్స్ కాదు) త్రాగించటం చాలా అవసరం. ఈ సమయం లో ఆంటిబయోటిక్ సిరుప్ కానీ దగ్గు జలుబు కి సంబందించి మందులు కానీ ఇవ్వవలసిన అవసరం లేదు, వాటి వలన మంచికంటే చెడు ఎక్కువగా ఉంటుంది. జ్వరం తగ్గిన సమయం లో పిల్లాడు ఆడుకుంటున్నాడు మరియు పాస్ బాగా పోస్తున్నాడు అంటే ఆ జ్వరం ప్రమాదకరం కాదని అర్థంచేసుకోవాలి. Paracetmol యొక్క పనితనం కేవలం ఆరుగంటలు మాత్రమే ఉంటుంది తరువాత మళ్ళి జ్వరం వస్తుందని గ్రహించాలి.పారాసెటమాల్ మందును వేసిన తర్వాత పనిచేయటానికి ౩౦ నిమిషాలనుండి ఒక గంట వరకు పట్టచ్చు. ఒక్కొక్కసారి పిల్లలు మందు వేయగానే కక్కేస్తుంటారు. ఒక వేళ మందు వేసిన పదిహేను నిమిషాలలోపల కక్కితే మందు మళ్ళి వేయవలసి ఉంటుంది.మందు చేదు తగ్గటానికి అంతకి అంత మంచినీటిలో కానీ పాలలో కానీ కలిపి వేయవచ్చు. తల్లిదండ్రులు సాధారణంగా చేసే తప్పులు: 1.)డైరెక్ట్ గా మెడికల్ షాప్ కి వెళ్లి మందులు తెచ్చి వాడటం, అందులో అనవసరమైన ఆంటిబయోటిక్స్(antibiotics) ఉండటం, ఓవర్ డోస్ లో మందులు ఇవ్వటం 2.)శరీర ఉష్ణోగ్రత/temperature చూడకుండా వొళ్ళు వెచ్చబడగానే paracetmol ఇవ్వటం 3.) Paracetmol లో డ్రాప్స్(Drops) మరియు ,125 పవర్, 250 పవర్, 500 పవర్ syrups ఉంటాయని తెలియక లేక తికమకపడి తప్పు డోస్ లో మందు ఇవ్వటం, దానివలన జ్వరము తగ్గకపోవడం లేక ప్రమాదకరమైన డోస్ లో మందు ఇవ్వటం 4.) చిన్నపిల్లల్లో ఆవిరిపట్టటం లేదా తడిగుడ్డ వంటిమీద వదిలెయ్యటం , వాటివల్లన పిల్లలకు గాయాలు కావటం లేదా వొళ్ళు చల్లబడిపోవటం 5.)బలవంతంగా ఆహరం పెట్టటం దానివలన వాంతులు అవ్వటం, తాగటానికి సరిపడా నీరు లేదా ద్రవపదార్థాలు ఇవ్వకపోవటం మీరు మీ బిడ్డను ఎప్పుడు వైద్యుడి వద్దకు తీసుకెళ్లాలి? క్రింది లక్షణాలలో ఏఒక్కటి ఉన్న మీ పిల్లల డాక్టరుగారికి చూపించండి. పిల్లవాడు చాలా తక్కువ ఆహారాన్ని తీసుకుంటుంటే మరియు తల్లి పాలు లేదా నీరు త్రాగడానికి కూడా ఆసక్తి చూపకపోతే జ్వరం 101.5° F / 39° C కు మించి . ఈ ఉష్ణోగ్రత కంటే ఎక్కువ ఉంటే అధిక జ్వరం / high grade fever అంటారు. బాబు లేదా పాప ఆరు గంటలలో కనీసం ఒక్కసారి కూడా పాస్ పోయకపోయినా. జ్వరం 2 రోజులకు/ 48 గంటలకు మించి ఉంటె. చర్మంపై దద్దుర్లు/ rash ఉన్న జ్వరం. ఒక వేళ మీ బాబు లేదా పాప ఏదైనా దీర్ఘకాలిక వ్యాధి తో బాధపడుతుంటే. 6 నెలల కన్నా తక్కువ వయస్సు ఉన్న పిల్లలకి జ్వరం ఉంటే (టీకా ఇచ్చిన 24 గంటలలోపు తప్ప.) పాస్ పోసేటప్పుడు ఏడుస్తుంటే లేదా నొప్పిగా ఉందని చెప్తే వాంతులు / విరేచనాలు లేదా కడుపులో నొప్పి చెవి నొప్పి / నీరు లేదా చెవి నుండి చీము కరాటం కీళ్ళ నొప్పితో ఉండే జ్వరం. మీ బాబు లేదా పాప ఏవైనా మందులు దీర్ఘకాలంగా వాడుతుంటే(స్టెరాయిడ్స్ లేదా ఇమ్మ్యూనిటి తగ్గించే మందులు). అత్యవసరంగా డాక్టర్ గారినిని కలవాల్సిన సందర్భాలు: ఎక్కడనుండి అయినా రక్తస్రావం జరిగినా పిల్లవాడికి ఫిట్స్ వచ్చినా లేదా కళ్ళు తేలవేసినా పిల్లవాడు ఆయాసపడుతున్నా ఆరు గంటలకుమించి పాస్ పోయకపోయినా పిల్లవాడు అసాధారణంగా ప్రవర్తిస్తుంటే లేదా ఎక్కువ సమయం నిద్రపోతుంటే లేదా మగతగా ఉంటే

అత్యవసర సమయం లో మీ డాక్టరుగారికి కానీ 108 కి కానీ కాల్ చేయటానికి సంకోచించకండి. లెదా  89199 94819 కి డాక్టర్ గారి సలాహా కోసం వాట్సాప్ చేయండివ్యాసంలో తెలుపపడిన వివరాలు కేవలం తల్లిదండ్రులలో అవగాహన కల్పించడానికి మాత్రమే. ఎల్లప్పుడూ మీ బాబుని లేదా పాపని చూస్తున్న డాక్టరుగారి సలహాని అనుసరించండి.
 ఈ వ్యాసంలో లో విషయాలు డాక్టర్లు అందరూ చెప్పేవే కాని తల్లిదండ్రుల వీలుకోసం ఇక్కడ పొందుపరచబడ్డాయి.



Disclaimer: This document cannot be used for any medico-legal purpose.

కామెంట్‌లు

  1. Thank you so much doctor....it's very crisp and clear...having a kid at home it is very helpful to me...

    రిప్లయితొలగించండి
  2. పాప వయస్సు 2yaers 2months
    Kovidpositive
    Intlo also
    Father,mother ki positive
    Papaki light ga fevir vachi
    Pound, simtons avi levu
    10 days iendi, ikkada simtons
    Yemi leka pote medicine s vaddu
    Annaru.medichine vadala vadda.cheppandi,please

    రిప్లయితొలగించండి
  3. మీరు చాలా మంచి పని చేస్తున్నారు.

    రిప్లయితొలగించండి
  4. మీరు చాలా మంచి పని చేస్తున్నారు.

    రిప్లయితొలగించండి
  5. మీరు చాలా మంచి పని చేస్తున్నారు.

    రిప్లయితొలగించండి
  6. అందరికీ చాలా ఉపయోగంగా చెప్పారు సర్. Great efforts and great service సర్. Tq.

    రిప్లయితొలగించండి
  7. చాలా ఉపయోగకరమైన సందేశం‌ డా.గారు.

    రిప్లయితొలగించండి

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

Part 2 పిల్లలలో టీకాలు వేయించాలా? ఏవి వేయించాలి? ఎక్కడ వేయించాలి? రెండొవ భాగం. Guide book to help parents with vaccination 2.

How can we treat children who have symptoms of COVID a home?