ఆరు నెలలలోపు వయసున్న పిల్లలగురించి తల్లిదండ్రులు తెలుసుకోవలసిన ముఖ్యమైన విషయాలు. Important things to know while raising an infant(until 6 months of age).
పాపాయికి ఒక నెల వయసు నిండగానే ఒక ముఖ్యమైన మైలురాయి దాటినట్లు. తల్లిలో పాపను తాను చూసుకోగలననే ధైర్యం వస్తుంది. ముఖ్యంగా చూడటానికి వచ్చేవాళ్ళు తగ్గుతారు, సమస్యలు, సలహాలు తగ్గుతాయి. కాని కొన్ని ప్రత్యేకమైన ఇబ్బందులు ఈ వయసులోనే మొదలవుతాయి. కాబట్టి తల్లిదండ్రులకు ఏది సహజం , ఏది ప్రమాదం, ఎప్పుడు వెంటనే హాస్పిటల్ కి తీసుకెళ్ళలో తెలుపటం కోసం ఈ వ్యాసం. 6 నెల ల లోపు పిల్లలకు ఏది సహజం? ) ప్రతీనెలా అర కేజి నుండి కేజి వరకు బరువు పెరుగుతారు. ఐదు నెలలు నిండేసరికి పుట్టిన బరువుకి రెట్టింపు బరువవుతారు. ) తల్లి పాలు లేదా డబ్బా పాలు తాగిన తరువాత మూడు నుండి ఐదు గంటల వరకు పడుకుంటారు. ఒక వేళ గంట గంటకు లేచి ఏడుస్తుంటే పాలు సరిపొవట్లేదని అర్థం. ) నెల వయసు నుండి ఐదు నెలలల వయసు లోపు పిల్లలు ఒక్కొక్కసారి ఉన్నట్లుండి ఏడవటం మొదలు పెడతారు. గంట నుండి రెండు గంటలవరకు ఏడుస్తారు. అల ఏడుస్తున్నప్పుడు పొట్ట బిగుతుగా అనిపిస్తుంది. కొంత మంది పిల్లలు గుక్క తిప్పకుండా ఏడుస్తారు. ఇది సాధారణంగా సాయంత్రం వేళ నుండి అర్థరాత్రి మధ్యలో జరుగుతుంటు...