పోస్ట్‌లు

ఏప్రిల్, 2021లోని పోస్ట్‌లను చూపుతోంది

చిన్న పిల్లలలో కరోనా, ఇంట్లో ఉంటూ చూసుకోగలమా ?

చిత్రం
  కరోనాకి మందు లేదు, కాని భయానికి మందు ఉంది, అదే  సరైన సమాచారం మరియు  జ్ఞానం . కరోనా రెండొవ వేవ్ లో మనం పెద్దలతో పాటు చిన్న పిల్లల లో కూడా లక్షణాలు రావటం చూస్తున్నాం. పిల్లల్ని వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్లాలనిపించినా తీసుకెళ్లలేని పరిస్థితుల్లో ఎందరో తల్లిదండ్రులు ఉన్నారు. ఇలాంటి సమయంలో తల్లిదండ్రులలో ఈ వ్యాధి గురించి అవగాహన పెంచడం ద్వారా వారిలో కొంత దైర్యాన్ని నమ్మకాన్ని నింపటమే ఈ వ్యాసం లక్ష్యం.  మొదటిగా గుర్తుపెట్టుకోవాసింది పెద్దలతో పోలిస్తే పిల్లలు ఈ వ్యాధిని సులభంగా జయిస్తారు. గత సంవత్సర కాలం లో వందలాది మంది ఇలాంటి పిల్లలను చూసి,  వేలాదిమంది తల్లిదండ్రులతో మాట్లాడిన తరువాత వారిలో సహజంగా వచ్చే అనుమానను నివృత్తి చేయటానికి ఈ  ప్రయత్నం చేస్తున్నాను. పిల్లల లో కరోనా వ్యాధి వచ్చినట్లు ఎప్పుడు అనుమానించాలి ? ఇంట్లొ ఎవరికైన గత పదిహేను రోజులలోపు కరోనా వచ్చి ఉంటె, లేదా బాబు లేదా పాప స్కూల్ కి లేదా ట్యూషన్ కి వెళ్తుంటే , ఈ క్రింది లక్షణాల్లో ఏదైనా ఉంటే 1.) దగ్గు   2.) జలుబు 3.) తలనొప్పి   4.)వాంతులు  5...